దేశ,రాష్ట్ర భవిషత్తు యువత చేతిలో ఉందని గుర్తు పెట్టుకోవాలి.
జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు..
ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్రన్యాయ సేవాధికారసంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఈ రోజు నుండి 12వ తేదీ వరకు "యువజన అవగాహన సదస్సులు" నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సోమవారం స్థానిక సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీకాలేజీ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు అన్నారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ నేటి యువత సోషల్ మీడియా వల్ల సమయాన్ని వృధా చేస్తున్నారని, సమయం డబ్బుకన్నా ఎంతో విలువైనదని విద్యార్థులు క్రమశిక్షణతో దేశ భవిష్యత్తుకు కృషి చెయ్యాలని సూచించారు. అలాగే నేటి సమాజంలో ర్యాగింగు, మాదకద్రవ్యాలు వినియోగం పెరిగిందని ఇటువంటి దురాచారాలను అరికట్టడంలో విద్యార్థులు సహకారం చాలా అవసరమని సూచించారు.
యువత మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్నో చట్టాలను తయారు చెయ్యడం జరిగిందని, ప్రతి వ్యక్తి చట్టానికి లోబడి జీవించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించడమే నేరముగా పరిగణిస్తామని కావున విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. నేటి సమాజంలో తరచుగా బాల్య వివాహాలు నిర్వహిస్తున్నారని వీటిని అరికట్టడానికి విద్యార్థులు సంబంధిత అధికారులకు సహకరించాలని సూచించారు.
ఆర్థికంగా వెనుకబడిన, షెడ్యూల్ కులాలు, తెగలు, బాలబాలికలకు, వృద్ధులకు, ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు, మహిళలకు ఉచిత న్యాయ సహాయాన్ని న్యాయ సేవాధికార సంస్థలు అందించడం జరుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారు దగ్గర్లోని న్యాయ సేవాధికార సంస్థలను కాని 15100 ద్వారా అన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ మాస్టరు పి.రత్నరాజు, క్రాఫ్ సోషల్ వర్కరు యస్.రవిబాబు, ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు, మూడవ పట్టణ పోలీసుస్టేషను ఏఎస్ఐ యం.హరిచంద్రప్రసాదు, కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.















Social Plugin