రావిచెర్లలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

రావిచెర్లలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
మహిళలకు చీరలు, విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ

ఏలూరు జిల్లా / నూజివీడు: నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్స్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకులు, రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

జన్మదిన వేడుకలలో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు, గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలు గ్రామస్థుల మన్ననలు పొందాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత నారా లోకేష్ కే దక్కుతుందని అన్నారు. విద్య రంగంలో ఆయన తీసుకున్న సంస్కరణలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు అరికోటి పౌల్ రాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు రాజేష్, గ్రామ ఎంపీటీసీ సభ్యులు మరీదు శివనాగమణి, గ్రామ పార్టీ అధ్యక్షులు లావు మురళీమోహనరావు, వైస్ సర్పంచ్ ముల్లంగి మోషే, మాజీ ఎంపీటీసీ సభ్యులు వెనిగళ్ల సాంబశివరావు, మరీదు చెన్నకేశవరావు, పాత రావిచెర్ల గ్రామ ప్రెసిడెంట్ కొనతో సాంబశివరావు, బోరవంచ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పామర్తి వేణు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.