ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వివిధ శాఖల అధికారులు..
భోగి మంటలు గంగిరెద్దుల ఆటలు చూడముచ్చటగా తీర్చిదిద్దిన పల్లెటూరు వాతావరణం బొమ్మల అలంకరణలు..
ఔరా అనిపించిన భోగిమంటలు గంగిరెద్దుల విన్యాసాలు రంగవల్లులు సాంస్కృతి కార్యక్రమాలు సంప్రదాయ వస్త్రాధరణ..
ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు.
తొలిత వీరికి ఘనంగా స్వాగతం పలికారు. గంగిరెద్దుల ఆటలు సంక్రాంతిలో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండి, పిట్టలకోతలు, హరిదాసుల కీర్తనలు, కోలాటాలను వారు తిలకించారు. గోమాతకు దూడకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తదుపరి వివిధ శాఖల మహిళలు వేసిన రంగవల్లులను స్వయంగా పరిశీలించారు. పాల పొంగళ్లను పెట్టారు. అనంతరం చిన్నారులకు భోగి పళ్ళను పోసి పిల్లలను ఆశీర్వదించి ఉత్సాహపరిచారు. పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
కోలాటాల ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్రీడా పోటీలను సంబరాలు పేరిట నిర్వహించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మీ అందరి సమక్షంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకను ఎంత ఘనంగా నిర్వహిస్తున్న ఘంట పద్మశ్రీ ప్రసాద్ ని అభినందించారు.
ఆర్టీసి జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ తెలుగువారికి అన్ని పండుగలు కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ అన్నారు. ఈ పండుగను ఆనందంతో రైతులు జరుపుకోవాలని అనాదిగా వస్తుందని దీన్ని రైతుల పండుగ కూడా పిలుస్తారు అన్నారు. పండుగ మూడు రోజులపాటు తెలుగు పల్లెలు చాలా ఆహ్లాదకరంగా ఉండి, రకరకాల జానపద, వినోద కళాకారులతో వీధులు పండగ వాతావరణం లో కనిపిస్తాయన్నారు.
ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశం జరుపుకుంటుందన్నారు. సంక్రాంతి సంబరాలలో గోదావరి ప్రాంతం కలకలలాడుతూ ఉంటుందని, బంధుమిత్రులు రాకతో పలు ప్రాంతాలు సంబరాలుగా ఉంటాయని అన్నారు.
గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం, ప్రజలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి పల్లె సీమలు సరదాగా ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, ఆర్డీవోలు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు..



.jpeg)

.jpeg)

































Social Plugin