శ్రీ చైతన్యలో ఘనంగా సంక్రాంతి సంబరాలు


ఏలూరు జిల్లా, చింతలపూడి: మండలం చింతలపూడిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగిమంటలు, పిండివంటలు, గాలిపటాలు, భోగి పళ్ళు, రంగవల్లులు, గంగిరెద్దు ఆటలతో, విద్యార్థుల కేరింతలతో ఘనంగా వేడుకలు జరిగాయి. 


ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానాచార్యులు వరలక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ సంక్రాంతి అంటే సంకరుడు పుష్యమాసంలో ధనస్సురాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతిగా జరుపుకుంటామని, సంక్రాంతి అనేటటువంటి పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని వర్ణాలవారు జరుపుకునే ఏకైక పండుగని, రైతులంతా పండించినటువంటి ధాన్యాన్ని ఇంటి దగ్గరికి తెచ్చుకుని లక్ష్మీదేవిగా భావిస్తారని తెలియజేశారు. 

ఏ.జి.యమ్ పార్థసారథి రీజినల్ ఇంచార్జ్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ భోగిపళ్ళను చిన్నపిల్లల మీద పోయడానికి గల కారణాన్ని ఈ విధంగా తెలియపరిచారు. చిన్న పిల్లలకు అంటే 11 సంవత్సరాల వయసు వచ్చేవరకు భోగిపళ్ళని వాళ్ళ యొక్క శిరస్సుల మీద వేస్తారని ఈ విధంగా వేయడం వలన బ్రహ్మారంద్రం అనేది తెరుచుకుంటుందని జ్ఞానోదయం అనేది కలుగుతుందని పూర్ణ ఆయుష్కులు అవుతారని దానికి కారణంగా రేగిపళ్ళని భోగి పళ్ళుగా పిలుస్తూ ఆరోజు వాటిని ఆ విధంగా చేస్తారని ఆయన తెలియజేశారు. 

కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి రోజున పితృదేవతలకి వస్త్రాలు సమర్పించడం వల్ల వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయని వారికి ఉత్తమ గతులు కలుగుతాయని ఆయన ఎరుకపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా అకాడమిక్ డిన్ చెన్నకేశవులు, సి బ్యాచ్ ఇంచార్జ్ మధు, ఏ.ఓ రవీంద్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.