ఏలూరు జిల్లా, ఏలూరు: గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులకు ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పూర్తి స్థాయి బందోబస్తుపై విస్తృతంగా బ్రీఫింగ్ నిర్వహించారు. మ్యాప్ ద్వారా రూట్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రూట్ బందోబస్తుతో పాటు రూఫ్‌టాప్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని, ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీవీఐపీ కాన్వాయ్, కంటింజెంట్ ప్లాన్ ప్రకారం పార్కింగ్, ట్రాఫిక్ కాంపోనెంట్‌తో పాటు అన్ని సెక్టార్‌లు, రూట్ మరియు రూఫ్‌టాప్ బందోబస్తును పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
కల్వర్ట్ చెకింగ్, బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్‌లతో యాంటీ సబోటేజ్ చెకింగ్, ఆర్‌ఓపీ, కూంబింగ్ కార్యక్రమాలను క్షుణ్ణంగా నిర్వహించాలని, వీవీఐపీ వెళ్లే మార్గంలో వ్యతిరేక దిశలో వాహనాల కదలికలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.
సిబ్బంది అందరూ సరైన యూనిఫాం, తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని, వర్ష పరిస్థితుల దృష్ట్యా రెయిన్ కోట్లు తీసుకురావాలని తెలిపారు. విధులకు కేటాయించిన ప్రదేశాల్లో సమయానికి హాజరై, డ్యూటీ పాయింట్ వదిలి వెళ్లరాదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
అలసత్వం, గైర్హాజరు వంటి విషయాల్లో శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీ-బ్రీఫింగ్ పూర్తయ్యే వరకు విధుల్లోనే ఉండాలని, మాన్ ప్యాక్‌పై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
అనంతరం గౌరవ ముఖ్యమంత్రి సందర్శించనున్న అన్ని ప్రదేశాల్లో పూర్తి స్థాయి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూరి చందర్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా, పోలవరం డీఎస్పీ ఎన్. వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావుతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
















Social Plugin