కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి..


సమాజంలోని మూఢనమ్మకాలను వేమన తన పద్యాలతో పారదోలారు- జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
యోగి వేమన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ జెసి, అధికారులు


ఏలూరు:  సమాజంలో కులమత బేధాలు, మూఢనమ్మకాలను తన పద్యాలతో పారద్రోలెందుకు యోగి వేమన కృషి చేసారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హలులో  సోమవారం యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  సందర్బంగా యోగివేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యోగివేమన గొప్ప సంఘ సంస్కర్త అని, తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వేమన శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగివేమన అని అన్నారు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు ప్రస్తుత సమాజంలోని యువతకు ఎంతో అనుసరణనీయమన్నారు.

కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,  డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ,సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, ఐసిడిఎస్ పిడి శారద, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, పర్యాటక శాఖ మేనేజరు పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.