ఏలూరు జిల్లా కైకలూరు: నియోజకవర్గం, కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో కైకలూరు నియోజకవర్గ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న KPPL–2026 కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, కైకలూరు నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించడంలో కైకలూరు పోలీస్ శాఖ ముందుండటం అభినందనీయమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యువత కోడిపందాలు, పేకాట తదితర అనవసర కార్యకలాపాల వైపు వెళ్లకుండా క్రీడల వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచనల మేరకు, కైకలూరు సీఐ రామకృష్ణ, ఎస్సై వెంకట కుమార్, ఎస్సై శ్రీను సౌజన్యంతో ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.















Social Plugin