ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆస్పత్రిని ప్రజలకు అంకితం చేశారు.
ఎన్‌హెచ్‌పీ, ఏపిహెచ్‌ఎస్‌ఎస్‌పి పథకాల కింద రూ.104.92 లక్షల నిధులతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. పట్టణ ప్రజలకు ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలోని గదులను పరిశీలించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు.















Social Plugin