ఏలూరు జిల్లా,చాట్రాయి: నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు శనివారం చాట్రాయి మండలంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు.
చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ కి అందిన సమాచారం మేరకు, చిత్తపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న శిబిరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,070 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి. రామకృష్ణ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు కలిగించే జూద క్రీడలను ఎవరైనా ప్రోత్సహించినా లేదా వాటిలో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలు తమ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీసే జూద క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చాట్రాయి ఎస్‌ఐ తెలిపారు.















Social Plugin