ఏలూరు జిల్లా/పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా పరిషత్‌లో దిగువ శ్రేణి సహాయకులుగా విధులు నిర్వహిస్తూ విశేష సేవలు అందించిన 14 మందికి ఎగువ శ్రేణి సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ, వారికి సంబంధించిన పదోన్నతి పత్రాలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ఉద్యోగుల కృషి, నిబద్ధత, బాధ్యతాయుతమైన సేవలే పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. పదోన్నతులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం, బాధ్యతా భావాన్ని పెంచుతాయని, పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత అంకితభావంతో ప్రజాసేవలో పాల్గొని జిల్లా పరిషత్ అభివృద్ధికి తమ సేవలు కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్ పాల్గొని పదోన్నతి పొందిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















Social Plugin