దక్షిణపు–పడమర వీధుల్లో గంగానమ్మ జాతర మహోత్సవం


దక్షిణపు–పడమర వీధుల్లో గంగానమ్మ జాతర మహోత్సవం
అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి, విప్ బొలిశెట్టి శ్రీనివాస్


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి మరియు పడమర వీధిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

జాతరలో భాగంగా మేడల్లో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి జాతర కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

అనంతరం వారు మాట్లాడుతూ, శతాబ్దకాలానికి పైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరను దక్షిణపు వీధి, పడమర వీధి జాతర కమిటీ సభ్యులు ఐక్యంగా, భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ఏలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

దక్షిణపు వీధి, తూర్పు వీధిలో జరుగుతున్న జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మహాకుంభం కార్యక్రమానికి, 26వ తేదీన చిత్రవిచిత్ర వేషధారణలతో భారీ భక్తజనసందోహంతో జరగనున్న కొర్లబండి ఊరేగింపుకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఊరేగింపును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న జాతర కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో పడమర వీధి జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలసుబ్రహ్మణ్యం (బాలు), డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ కరణం గణేష్, ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య, జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు నగిరెడ్డి కాశీ నరేష్, పండు నాయుడు పాల్గొన్నారు.

అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, స్థానిక నాయకులు కూనిశెట్టి మురళీకృష్ణ, బోండా రాము నాయుడు, పైడి లక్ష్మణరావు, నూకల సాయి, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం, కొనికి మహేష్, వాసా సాయి, లక్కింశెట్టి కిరణ్, మేకా సాయి, వివిధ డివిజన్‌ల ఇన్‌చార్జీలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.