నూజివీడు IIIT విద్యాసంస్థను గాలికి వదిలేసిన అధికారులు: ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్


ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న కానీ విద్యార్థులు సమస్యలు పరిష్కారం కావట్లేదు.
అర్ధాకలితో కళాశాలలో విద్యార్థులు..
విద్యార్థులు తింటున్న భోజనాలు  సరిగ్గా లేకపోవడం, అర్ధ ఆకలితో  వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నూజివీడు IIIT విద్యాసంస్థలో నెలకొంది....
ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ 


ఏలూరు జిల్లా, నూజివీడు: స్థానిక నూజివీడు నగరం లో ఉన్న IIIT విద్యాసంస్థ లో అనేక మంది విద్యార్థులను ఉన్నతస్థాయిలో నిలపెట్టే విద్యాసంస్థను కేవలం అధికారులు, మరియు రాజకీయా నాయకులు నిర్లక్ష్యంతో విద్యసంస్థ పూర్తిగా సమస్యలతో నిండిపోయింది. IIIT విద్యసంస్థలో నెలకొన్న సమస్యలను అధికారులు ఏమాత్రం కూడా స్పందించట్లేదని, విద్యార్థులు తినే భోజనాలు బాగోకపోవడంతో అర్ధాకలితో కళాశాలలో చదువుకోవాల్సిన దుస్థితి నెలకుంటుందని విద్యార్థులు తెలియచేస్తున్నారని, విద్యార్థులు  ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో  అధికారుల విఫలమయ్యారని ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలు నుండి గ్రామాల నుండి నూజివీడు కి వచ్చి IIIT లో చదువుతూ, విద్యార్థులు పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చుకోవాలని నూజివీడుకు తరలివస్తున్న విద్యార్థులకు  కనీసం భోజనం కూడా అందించలేకపోతున్న అధికారులు నిర్లక్ష్యంతో విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారని, అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన విద్యార్థులు సమస్యలు పరిష్కారం కావట్లేదని, అధికారులు అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు.
 
తక్షణమే నూజివీడులో ఉన్న IIIT విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేక పోతే నూజివీడు నియోజకవర్గంలో చదువుతున్నా విద్యార్థి లోకాన్ని కలుపుకొని ఆందోళనకు స్వీకారం చూడతామని హెచ్చరించారు.