ఏలూరు జిల్లా, పోలవరం: పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గంలోని మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రహదారి నిర్మాణాల కోసం సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు.
అదనంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నాయకుల మధ్య సుమారు గంటసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది.
పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.















Social Plugin