ఏలూరు, డిసెంబర్ 13: స్థానిక దక్షిణపు వీధిలో ఉన్న శ్రీ జరాపహరేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు కలిసి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఏలూరు సొసైటీ బ్యాంకు చైర్మన్ అమరావతి అశోక్, AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కో-ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, నూకల సాయి ప్రసాద్, మురళి కృష్ణ, దోసపర్తి రాజు నాయుడు, వీర మహిళలు వెలగా గాయత్రీ, యడ్లపల్లి మమతాతో పాటు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది.
















Social Plugin