చింతలపూడి (పశ్చిమ వాహిని ప్రతినిధి): ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు ఉన్నమట్ల ఎలిజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ త్యాగదనులు, ప్రజాస్వామ్య విలువలతో నిలిచిన పార్టీ అని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన ఒక దురదృష్టకర సంఘటన అయినప్పటికీ, అప్పటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే విభజన అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గానీ, తరువాత వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం గానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయని అన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, అందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin