సుమారు 300 మంది వైసిపి నేతలు, కార్యకర్తలు జనసేనలోకి
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం: మండలం యర్రంపేట గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వారందరికీ జనసేన పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యర్రంపేట గ్రామ ప్రజలు జనసేనపై నమ్మకం ఉంచి పార్టీలోకి చేరడం ఎంతో ఆనందకరమని, ఇది రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, బాధ్యత ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, దగ్గిన శ్రీనివాస్, కోన కుమార్ బాబు, మాదరపు శ్రీనివాస్, అనిశెట్టి సత్తిబాబు, అడపా చింటూ, అడపా ప్రవీణ్, రేపల్లె ప్రసాద్ తదితర కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin