"గ్రామాల అభివృద్ధికై ఐక్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేద్దాం - ప్రతి కుటుంబానికి సుపరిపాలన అందిద్దాం - వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయండి" : పెదపాడు మండలం అప్పన్నవీడులో జరిగిన పెదపాడు మండల విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ వెల్లడి..
దెందులూరు/పెదపాడు, డిసెంబర్09: గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత ఇంటి స్థలం మంజూరు చేయటంతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించేలా స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. పెదపాడు మండలం అప్పన్న వీడులో మంగళవారం ఉదయం పెదపాడు మండల విస్తృతస్థాయి సమీక్ష సమావేశం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో పెదపాడు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటే సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు..
అదేవిధంగా తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా జమ కాని తల్లుల వివరాలను ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు వెంటనే నివేదికను సమర్పించాలని, సత్వరమే ఆయా తల్లులకు కూడా తల్లికి వందనం డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు మాత్రమే కాకుండా స్మశానాల అభివృద్ధికి సైతం అవసరమైన చర్యలు చేపట్టాలని కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని స్మశానాల పై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు..
సొంత ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారు వారికి కావలసిన అర్హత ప్రమాణాలను సిద్ధం చేసి ఏఏ గ్రామాల్లో ఎంతమందికి ఎన్ని ఇళ్లు అవసరం ఉందో గ్రామాల వారీగా నివేదికలను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను సూచించారు. అదేవిధంగా పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పనులు తీరును ఆయా శాఖల అధికారులతో స్థానిక కోటమి నాయకులతో చర్చించి సమీక్షించారు..
కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారాన్ని అప్పగించిన ప్రజల సంక్షేమానికి క్షేత్రస్థాయిలోని మండల స్థాయి నాయకులు నుంచి బూత్ కన్వీనర్లు వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చోరవ చూపాలని, ఏదైనా అపరిష్కృత సమస్యలు ఉన్నప్పుడు నేరుగా తన దృష్టి తీసుకొస్తే పరిష్కరించి అండగా నిలుస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

















Social Plugin