వేలేరుపాడు మండలంలో రూ. 5.50 కోట్ల వ్యయంతో కొత్త రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన


- పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


ఏలూరు జిల్లా, వేలేరుపాడు: మండల పరిధిలో మొత్తం రూ. 5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న శాశ్వత రహదారి నిర్మాణ పనులకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “మండలంలోని గ్రామాలకు సమగ్ర రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నాణ్యమైన రహదారి నిర్మాణ పనులకు ప్రాధాన్యతనిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. ప్రతి రహదారి పనిని వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత శాఖకు ఆదేశించాం” అని పేర్కొన్నారు.

శంకుస్థాపన చేసిన రహదారి మార్గాలు:
వినాయకపురం – రెడ్డిగూడెం క్రాస్ రోడ్
రెడ్డిగూడెం క్రాస్ రోడ్ – కోయిదా రోడ్
వసంతవాడ – రుద్రం కోట రోడ్
రుద్రంకోట – వేలేరుపాడు రోడ్
కుక్కునూరు అశ్వరావుపేట – రెడ్డిగూడెం క్రాస్ రోడ్

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గణేసుల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పోట్ల మోహన్ దొర, దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి, పోడియం తులసి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కొవ్వల క్రాంతి కుమార్, రాయల రవికుమార్, మంచర్ల సమ్మయ్య, సోడే కళ్యాణ్, టీం లోకేష్ అధ్యక్షులు బుడిపుటీ సురేష్, సావిలి ఆనందరావు, టిడిపి సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, యాళ్ల శంకరం, కొర్రి కౌశిక్, బిజెపి ప్రధాన కార్యదర్శి సారే బాబ్జి, అలాగే వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.