ఏలూరు జిల్లా నూజివీడు: పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా వన్‌వే సిస్టమ్‌ను తాత్కాలికంగా తొలగించడంతో పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో నూజివీడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ సమస్యను నియంత్రించాల్సిన అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రోడ్లపై వాహనాలు అడ్డంగా పార్క్ చేస్తూ ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్న షాపుల యాజమాన్యాలు కూడా పోలీసుల మాటను లెక్కచేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు వచ్చి షాపుల ముందు రోడ్డుపై నిలిపిన వాహనాలను తొలగించమని చెప్పినప్పుడు, “తీస్తాం లే… మాకు మీపై ఉన్న అధికారులందరూ తెలుసు” అంటూ అహంకారంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ జనరల్ స్టోర్స్, కృష్ణ బర్త్‌డే సెంటర్ వద్ద ఉన్న టీ కొట్టు, శివాలయం సమీపంలోని స్వీట్ షాప్, తిరువూరు బస్టాండ్ దగ్గర హోటల్ వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో షాపుల్లోకి వెళ్లే వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభిస్తోంది.
ఈ పరిస్థితికి పరిష్కారం కావాలంటే నిబంధనలు అతిక్రమిస్తున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధిస్తే గానీ సమస్య తీరదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని నూజివీడు ప్రజలు కోరుతున్నారు.















Social Plugin