ఏలూరు జిల్లా, చాట్రాయి: మండలంలోని బూరుగుగూడెం గ్రామానికి చెందిన మిద్దె సత్యనారాయణ కి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి రూ.50,000 విలువైన ఎల్‌ఓసి (LOC) చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పేదలు, అవసరంలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.















Social Plugin