రాజీ మార్గం రాజమార్గం, ఇరువురు విజేతలే అవుతారు- జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి


పంతాలు పట్టింపులకు పోయి ప్రతి చిన్న విషయానికి కోర్టులకు వచ్చి సమయాన్ని, డబ్బును వృథాచేసుకోవద్దు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి ...

ఏలూరు, డిసెంబరు 13: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, లోక్అదాలత్ ను  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్. శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని, కక్షిదారుల  సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే  నెల రోజుల నుండి నిర్వహిస్తున్న ఫ్రీ లోక్ అదాలత్  సిటింగ్స్ మరియు మధ్యవర్తిత్వం వల్ల 5  కేసులలో 50 లక్షల పైబడి వాహన ప్రమాద భీమా కేసులలో పరిహారంగా కక్షిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అత్యధికంగా రూ 73 లక్షల రూపాయలను చోళ జనరల్ ఇన్సూరెన్స్  కంపెనీకి సంబంధించి  రాజీచేయడం జరిగిందని తెలియజేశారు. కావున కక్ష దారులు సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ ను వినియోగించుకుని, తమ కేసులను పరిష్కరించుకోవాలని  సూచించారు. 

ఈరోజు సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాల వరకు 10,361 పెండింగ్ కేసులు 165 ప్రీలీటిగేషన్  కేసులను రాజీ చేసినట్లుగా తెలియచేశారు వీటిలో 147 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేసి సుమారుగా రూ 14 కోట్ల వరకు పరిహారంగా కక్షి దారులకు అందించడం జరిగిందని తెలిపారు. ఇంకా కొన్ని కోర్టులలో కేసుల పరిష్కారం జరుగుతూఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి యు.ఇందిరా ప్రియదర్శిని, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, స్పెషల్ జడ్జి ఫర్ ఫోక్సొ యాక్ట్ కేసెస్ జడ్జి కుమారి కె.వాణిశ్రీ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే.కే.వి.బుల్లికృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.ఎస్.వి.బి.కృష్ణ సాయి తేజ, బార్ అసోసియేషన్  ప్రెసిడెంటు కొనే సీతారాం, ప్రభుత్వ న్యాయవాది నియమాల సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యులు కాణాల కృష్ణమూర్తి, కృష్ణారావు, అభ్యునేని విజయకుమార్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.