ఏలూరు, డిసెంబర్ 13: ఏలూరుకు చెందిన యశ్వంత్ (వయస్సు 24 సంవత్సరాలు) అనే యువకుడు, CCS, ఏలూరు పోలీస్ కస్టడీలో ఉండగా మార్చి 2025లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు అడ్వకేట్ గ్లోజర్ డిసౌజా 14-03-2025న ఫిర్యాదు చేసినట్లు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఏలూరు వారిని మేజిస్టిరియల్ విచారణ నిర్వహించేందుకు నియమించినట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి మేజిస్టిరియల్ విచారణను ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో, ఆర్డీఓ కార్యాలయం, ఏలూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం తెలిసిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు, మరణించిన యువకుడి రక్త సంబంధీకులు లేదా ఈ కేసుకు సంబంధించిన ఇతరులు ఎవరైనా, సంబంధిత వివరాలతో తమ వాంగ్మూలాన్ని ఇవ్వడానికి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి హాజరుకావాలని ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ కోరారు.
%20(1).png)














Social Plugin