– ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో వందేళ్లుగా రైతుల ఆర్థిక అవసరాలకు అండగా నిలిచిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతుల అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర అపారమని, భవిష్యత్తులో కూడా రైతులకు మరింత బలమైన మద్దతు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం సహకార బ్యాంకులకు తమ సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సొసైటీల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ శతాబ్ది మహోత్సవ కార్యక్రమంలో రైతులు, ఏఎంసీ వైస్ చైర్మన్, ప్యాక్స్ చైర్మన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

.jpeg)















Social Plugin