జనసంద్రోహంగా జనవాణి – అర్జీలకు సత్వర పరిష్కారానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశాలు


బుట్టాయిగూడెం, డిసెంబరు 16: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మంగళవారం బుట్టాయిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన “జనవాణి” కార్యక్రమం జనసంద్రోహంగా కొనసాగింది. ఏజెన్సీ ప్రాంతం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా సమన్వయంతో పరిష్కార దిశగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

పెన్షన్లు, గృహ నిర్మాణం, రహదారులు, మౌలిక వసతులు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా స్పందించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టైగర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, గడ్డమనగు రవికుమార్, గ్రీనరీ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు బుచ్చిరాజు, ఐటీడీఏ పీవో రాములు నాయక్, కూటమి నాయకులు మొగపర్తి సోంబాబు, ఐటీ కోఆర్డినేటర్ ఏవి, జీఎస్ఎన్ నాయుడు, సింగంశెట్టి మనోహర్, తీగల గోపాలకృష్ణ, గురజాల వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, గుమ్మడి రమేష్, కే. సూరిబాబు, చిరంజీవి, ఉందుర్తి రాజు, కట్టుపల్లి రాజా తదితరులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.