బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సభ్యులు తనిఖీలు


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో ఉన్న  బాలల సంరక్షణ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు  బాలల సంరక్షణ కేంద్రాల తనికి కమిటీ చైర్మన్ అభిషేక్ గౌడ్ వారి ఆదేశములు ప్రకారం జిల్లా స్థాయి కమిటీ  సభ్యులు బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న 23 సంరక్షణ కేంద్రాలతో పాటుగా వివిధ కారణాల వలన రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా ఇతర సంరక్షణ కేంద్రాలను తనిఖీలు చేయడం జరుగుచున్నది.

సంరక్షణ కేంద్రాలలో బాలలకు అందించే వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితి మరియు విద్యా సౌకర్యాలు గురించి ఆరా తీశారు. ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు మరియు ప్రోటీన్స్ కలిగిన ఆహారం అందించాలని సూచించారు. కిచెన్, స్టోర్ రూమ్ లు మరియు మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి కేంద్రాలలో బాలలు ఆటలు ఆడుకోవటానికి అవసరమైన స్థలం ఉండాలని సూచించారు. 

రిజిస్టర్లను  చెక్ చేసి, జువెనైల్ జస్టిస్ చట్టం నియమ నిబంధనలు 2022 ప్రకారం అన్ని రిజిస్టర్లు మెయింటేన్ చెయ్యాలని కమిటీ సభ్యులు ఆదేశించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించనీ వారు, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న వారు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ సంరక్షణ కేంద్రాలుగా కానీ హాస్టల్ గా కానీ నిర్వహించకూడదని డి సి పి ఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి తెలియజేసినారు.

బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న సభ్యులు అందరికీ ఒక రోజు శిక్షణ కార్యక్రమం 17.12.2025 న స్థానిక ఎంపిడిఓ సమావేశం మందిరంలో నిర్వహించటం జరుగుతుందని డి సి పి ఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో  కమిటీ సభ్యులు డీ పి ఓ (జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ) టి.జ్యోతి, డి సి పి యు సిబ్బంది శ్రీకాంత్ పిఓ ఐ సి మరియు ఎల్ పి ఓ శ్రీమతి జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.