ఏలూరు జిల్లాకు ఆపద్బాంధవుడు ఎంపీ మహేష్ యాదవ్ - షేక్ ఇజాజ్ అహ్మద్ కు భరోసా కల్పించిన ఎంపీ మహేష్ యాదవ్

అపస్మారక స్థితిలో షేక్ ఇజాజ్ అహ్మద్

 
అపస్మారక స్థితికి ముందు ఫోటో

ఏలూరు జిల్లా ఏలూరు: ఏలూరు జిల్లాకు ఆపద్బాంధవుడిగా మరోసారి ఎంపీ మహేష్ యాదవ్ నిలిచారు. వైద్య ఆరోగ్య శాఖలో క్లరికల్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏలూరుకు చెందిన షేక్ ఇజాజ్ అహ్మద్ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

వెంటనే అతడిని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర న్యూరో సర్జరీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే చికిత్సకు కావాల్సిన భారీ ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

ఈ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న ఎంపీ మహేష్ యాదవ్ వెంటనే స్పందించి, ఆశ్రం ఆసుపత్రి యాజమాన్యంతో స్వయంగా మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడమే కాకుండా, కష్టకాలంలో ఆ కుటుంబానికి ధైర్యం, భరోసా కల్పించారు.

ఎంపీ మహేష్ యాదవ్ చేసిన సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా భావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


భరోసా కల్పించిన ఎంపీ మహేష్ యాదవ్