కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు


రహదారులు నిర్మాణంతో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు.
రూ 97.6లక్షలతో  నియోజకవర్గములో  పలు అభివృద్ధి కార్యక్రమాలు.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి... 


ఏలూరు/నూజివీడు, డిసెంబరు 22: నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలంలో  తుక్కులూరు, జంగంగూడెం గ్రామంలో సోమవారం సిసి రోడ్లు, మరియు జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి ట్యాంకులకు శంకుస్థాపనలు, పలుఅభివృద్ధి పనులకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి శ్రీకారం చుట్టారు. సుమారు రూ 31.50 లక్షలతో సి సి రోడ్లు శంకుస్థాపన మరియు  జలజీవన్ మిషన్ రూ 66.24 లక్షల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు. 

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలోనే ఎన్నో విజయాలు సాధించామని, రానున్న రోజులు అన్ని మంచి రోజులేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు మనోభావాలు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్సుగా ముందుకు సాగుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం రూ 15 లకే మూడు పూటలూ కడుపునిండా భోజనం పెట్టి, నిరుపేదలు ఆకలి తీర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తల్లికి వందనం అమలు చేసి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూ 15 వేల రూపాయలు చొప్పున అందిస్తున్నామని అన్నారు. 

డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయులు పోస్టులను నియమించామని అన్నారు. అన్నదాత సుఖీభవ రూ 20 వేలు, రైతన్నా మీకోసం ద్వారా రైతులకు వ్యవసాయ సాగులో  మెలుకవలు తెలియజేయడం, లాభసాటి వ్యవసాయం అందించడమే లక్ష్యంగా ముందుగు సాగుతున్నామని అన్నారు. పింఛన్లు రూ 4 వేలు పెంపు,  వికలాంగులకు రూ 6 వేలు, బెడ్ రెస్ట్ పేసేంట్లకు రూ 15 వేలు, డయాలసిస్ పేసెంట్లకు రూ 10 వేలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. బహుళ జాతి సంస్థల రాకతో రూ 16 లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా సుమారు నిరుద్యోగ యువతకు సుమారు 7 లక్షల ఉద్యోగ కల్పన దేశంలోనే నెంబరు 1 నిలిసిన కూటమి ప్రభుత్వం అన్నారు. 3లక్షల ఇళ్ల నిర్మాణం, ఉచిత దీపం పథకం, విశాఖపట్నంలో గూగుల్ సంస్థ, లక్ష్మీ మిట్టల్ ఉక్కు సంస్థ, రిలియన్స్ సంస్థ ద్వారా వేల కోట్ల ఫుడ్ ప్రోసెసింగు సంస్థలు, ఇలా పలు అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.