ఏలూరు, డిసెంబర్ 12: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాలు, శిశుగృహాల ద్వారా ఆశ్రయం పొందుతున్న చిన్నారులను చట్టపరంగా దత్తత ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు బాలసదనంలో ఉన్న బేబీ భవాని అనే ఏడేళ్ల బాలికను తమిళనాడుకు చెందిన దివ్యానంగం–పద్మావతి దంపతులకు కేరింగ్స్ పోర్టల్‌లో రిజర్వ్ చేసుకున్న దరఖాస్తు ఆధారంగా, అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత ప్రీ-అడాప్షన్ ఫోస్టర్ కేర్ అందజేశారు.
అదే విధంగా శిశుగృహంలో ఆశ్రయం పొందుతున్న ఎనిమిది నెలల పసికందు బేబీ మోక్షజ్ఞను చెన్నైకు చెందిన సెందిల్ బి.ఆర్.–భానుప్రియ ఎస్ దంపతులకు దత్తతగా ఇచ్చారు. ఈ దంపతులు 2022లో కేరింగ్స్ పోర్టల్ ద్వారా దత్తతకు అప్లై చేసుకోగా, 2025 నవంబర్‌లో ఈ బేబీకి రిఫరల్ వెళ్లింది. దంపతులు ఆన్లైన్‌లో రిజర్వ్ చేసుకుని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమక్షంలో హాజరై అన్ని డాక్యుమెంట్లను ధృవీకరించుకున్నారు.
వెరిఫికేషన్ పూర్తిచేసిన అనంతరం కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా బేబీని దత్తతగా అందజేయడం జరిగింది. చట్టబద్ధ దత్తత ప్రక్రియలో పారదర్శకత, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్. సూర్యచక్రవేణి, శిశుగృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.















Social Plugin