పిల్లల్లో సృజనాత్మకత,వారిలో దాగి ఉన్న కళలను వెలికి తీసే వేదిక హలాపురి బాలోత్సవం..
ఏలూరు డిసెంబర్ 12: బాలబాలికల కేరింతలు నృత్య ప్రదర్శనలు విచిత్ర వేషధారణలు మ్యాజిక్ షోలు పద్యాలు జానపద నృత్యాలులుతో హేలాపురి ఆరవ బాలోత్సవం అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. వట్లూరు సిద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల ఆవరణలో ఆవరణలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రాంగణంలో బాలోత్సవం కోలాహలంగా జరిగింది.
బాలోత్సవం ప్రారంభం సందర్బంగా జాతీయ జెండాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుమూడి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. బాలోత్సవం పతాకాన్ని ఇటీవల డీఎస్సీ ఫలితాలలో 5 సబ్జెక్టులో ఉద్యోగాలు సాధించిన వేలేరుపాడు గ్రామానికి చెందిన నాగుల మంగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభ సందర్భంగా సిఆర్ రెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు చేసిన రోప్ స్కిప్పింగ్ అందరినీ ఆకట్టుకున్నది.
బాలల వేషధారణలు విన్యాసాలు కళలు సాంస్కృతిక వైభవం కోలాటాలు దేశ స్వాతంత్ర ఉద్యమ నాయకుల వేషధారణనలతో చిన్నారుల ప్రదర్శనతో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలోత్సవం కొనసాగింది. వ్యాసరచన పద్యం భావం సందేశాత్మక గీతాలాపన ఏకపాత్రాభినయం లఘునాటిక అంతర్జాలంలో అన్వేషణ వాయిద్య పరికరాలతో విన్యాసం సందేశాత్మక గీతాలు నృత్యం జానపద గీతాలు నృత్యం వంటి అంశాలలో విద్యార్థులు ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.
ప్రారంభ సభలో ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రాలను "మహోన్నత ఘట్టాలు"
" షిరోస్ " పుస్తకాలను ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా జరిగిన సభకు బాలోత్సవము అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరేళ్లుగా హేలాపురి బాలోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. బాలల్లో ఉన్న సృజనాత్మకతను వివిధ కళలను వెలికి తీసే పెద్ద వేదికను బాలోత్సవం కల్పించినందుకు గర్వపడుతున్నామన్నారు.
పెదపాడు ఎంఈఓ ఎస్ నరసింహమూర్తి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అన్ని పోటీలలో పాల్గొనడం విద్యార్థులకు అవసరం అన్నారు. బాలోత్సవం అటువంటి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందన్నారు.
సభలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన మోరాళ మహేష్ మరియు డీఎస్సీలో ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగరాణి లకు నిర్వాహకులు ఇచ్చి సత్కరించారు. మొదటి రోజు 350 పాఠశాల నుండి 8,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 53 కల్చరల్ యాక్టివిటీ జరిగాయి. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు విజిఎంఆర్ కృష్ణారావు, మహమ్మద్ అలీ, ఎమ్మెస్ కాంతారావు, హేలాపురి కళాకారుల సంఘం అధ్యక్షులు పెదపాటి రామకృష్ణ, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహ కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, మేతర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)



.jpeg)






















Social Plugin