![]() |
| కొత్త బట్టలు పంపిణీ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ తలారి నాగలింగస్వామి |
ఏలూరు జిల్లా, ఏలూరు/చింతలపూడి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వృద్ధులు, నిరుపేదలు, వితంతువులు, మహిళలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ తలారి నాగలింగస్వామి తన సేవా మనసును మరోసారి చాటుకున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా నిత్యం ముందుండే ఆయన, ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలోని నిరుపేదలకు అన్నదానం చేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
గత 20 సంవత్సరాలుగా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాలలో ప్రతి సంవత్సరం లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. వృద్ధులు, వితంతువులు, మహిళలు, అభాగ్యుల జీవితాల్లో ఆనందం నింపాలనే సంకల్పంతో నిరంతరం సేవలందిస్తున్నారు.
![]() |
| కొత్త బట్టలు పంపిణీ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ తలారి నాగలింగస్వామి |
ఈ ఏడాది కూడా ఏసుక్రీస్తు కుటుంబాలకు చేసిన గొప్ప కార్యములకు కృతజ్ఞతగా, అలాగే వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన దైవ ఆశీస్సులకు గుర్తుగా చింతలపూడి మండలం అంతోని నగర్ గ్రామంలో వృద్ధులు, మహిళలు, వితంతువులకు వస్త్రధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల మనసులను హత్తుకుంది.
తలారి నాగలింగస్వామి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసించారు. క్రిస్మస్ ఆత్మను సజీవంగా నిలుపుతూ ప్రేమ, దయ, సేవ అనే విలువలను సమాజంలో విస్తరింపజేస్తున్నారని అభినందనలు వ్యక్తం చేశారు.

.jpeg)














Social Plugin