ఎంపికైన విద్యార్థులను చింతలపూడి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు తన క్యాంపు కార్యాలయంలో ఆహ్వానించి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు పూర్తిగా అందిపుచ్చుకుని భవిష్యత్తులో నియోజకవర్గానికి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు వినూత్న ఆలోచనలు యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఈ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దిన కృష్ణలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల డైరెక్టర్లు తాడేపల్లి రాజా క్రాంతికుమార్, బట్టు విజయ్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు నిరంతర ప్రోత్సాహం అందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొని విద్యార్థులను అభినందిస్తూ వారి విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయి వేదికపై ఏలూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతున్న ఈ సందర్భంగా గ్రామం మొత్తం ఆనందోత్సాహాలతో నిండిపోయింది.















Social Plugin