ఏలూరు జిల్లా, భీమడోలు: భీమడోలు మండలం సంతపేటలోని స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహం వద్ద ఆయన 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని మోహనరంగా గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల పక్షాన నిలబడి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు వంగవీటి మోహనరంగా గారని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక కూటమి కుటుంబ సభ్యులు, స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా పేదలకు పండ్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమం సంతపేట పరిసర ప్రాంతాల్లో ఆప్యాయత, సేవాభావాన్ని ప్రతిబింబించిందని స్థానికులు పేర్కొన్నారు. మోహనరంగా గారి స్మరణలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలు అందరి మనసులను హత్తుకున్నాయి.

.jpeg)














Social Plugin