నాటుసారా తయారీని విడిచిపెట్టిన తయారీదారులకు ప్రత్యేక ఉపాధి..
ఏలూరు, డిసెంబర్, 3: నాటుసారా రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం నాటుసారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి (మార్పు) కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను నాటుసారాను పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారీదారులు నాటుసారా జోలికి వెళ్లకుండా గౌరప్రదమైన మార్గాన్ని ఎంపికచేసుకునేలా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. నాటుసారా విడిచిన కుటుంబాలను ఆధుకునేందుకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా సర్వే నిర్వహించి వారికి పెన్షన్లు, గృహాలు మంజూరు, స్వయం ఉపాధి రుణాలు మంజూరు వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేసేందుకు నాటుసారా ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.
అవసరమైన అనువైన ఉపాధికార్యక్రమాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుకోవాలన్నారు. నాటుసారా తయారీ ని వదిలిని కుటుంబాలకు గతంలో నవోదయం ద్వారా చాలా కుటుంబాలకు ఉపాధికి వివిధ శాఖల ద్వారా రుణాలు అందించడం జరిగిందన్నారు. వారు తిరిగి నాటుసారా తయారీ జోలికి వెళితే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయాలన్నారు. సమావేశంలో ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఏ. సి.ప్రభుకుమార్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఏ. ఆవులయ్య, డీఆర్డీఏ పీడీ ఆర్. విజయరాజు, ఎక్సయిజ్ శాఖ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
















Social Plugin