ఏలూరులో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు


వేడుకలను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ


ఏలూరు, డిసెంబర్, 3: విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ చేయూత నివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ పిలుపులినిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కలక్టరేట్ లోని సమావేశపు హాలులో  ఘనంగా నిర్వహించారు.  వేడుకలను జిల్లా జాయింట్ కలక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ అవకాశం ఇస్తే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోను తమ ప్రతిభను నిరూపించుకోగాలన్నారు. వారిని అన్ని రంగాలలో ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  

వారి సమస్యలపై అందిన ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్బముగా నవంబరు 25వ తేదీన నిర్వహించబడిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను జేసీ అందించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు కృషి చేస్తున్న స్వచ్చంద సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించారు.  
             
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్,  డి ఈ ఓ వెంకటలక్ష్మమ్మ, సెట్వెల్ సిఈఓ ప్రభాకర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి  అజీజ్, విభిన్న స్వచ్చంద సేవా సంస్థల  ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి,  హెన్రీ డొమినిక్, ఏ.వెంకట రమణ  వీరభద్రరావు,   కె.జయరాజు,  జి.రాధారాణి,  ప్రవీణ్ వర్మ,  యం.నాగభూషణం, యుగంధర్  ఆర్.నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.