ఏలూరు జిల్లా, వేలేరుపాడు, డిసెంబర్ 20: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దని, పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేస్తూ వేలేరుపాడు మండలం రామవరం ప్రధాన రహదారి వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కమ్యూనిస్టులు మరియు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకం పేదలకు భరోసాగా నిలుస్తోందని, దానిని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పథకం పేరు మార్పు లేదా అమలులో కోతలు పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బాడిశ రాము, రామవరం సర్పంచ్ పిట్టా ప్రసాద్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బంధం నాగేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మడివి కామయ్య పాల్గొని ప్రసంగించారు. అలాగే బంధం పెద్ద నాగేశ్వరావు, సోందే నాగరాజు, పిట్టా ముత్యాలరావు, మడకం దేశమ్మ, బంధం రమాదేవి, చుక్కమ్మ, బంధం సాయమ్మ, పిట్టా చంద్రావతి, గంగాదేవి, బంధం అర్జున్, పిట్టావీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, పేదలకు ఉపాధి అవకాశాలు మరింత పెంచాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
.jpeg)














Social Plugin