సాయి దీపక్‌కు క్రికెట్ కిట్ బహూకరించిన ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్
ఏలూరు | డిసెంబర్ 30: ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన హోమ్ గార్డ్ కుమారుడు క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ కనబరచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్–14 (U–14) జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా పోలీస్ విభాగంలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కె. సూరిబాబు (HG–833) కుమారుడు కె. సాయి దీపక్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, ఒక హోమ్ గార్డ్ కుటుంబం నుంచి వచ్చిన బాలుడు ఈ స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సాయి దీపక్ తన తండ్రితో కలిసి జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్పీ సాయి దీపక్ ప్రతిభను ప్రశంసిస్తూ, క్రికెట్ కిట్‌ను బహూకరించారు.
పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్న ఎస్పీ, సాయి దీపక్ భవిష్యత్తులో మరింత కష్టపడి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి, జిల్లా, రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అలాగే, తన కుమారుడి ప్రతిభను గుర్తించి నిరంతరం ప్రోత్సహిస్తున్న హోమ్ గార్డ్ సూరిబాబు ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. పవన్ కుమార్ గారు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.















Social Plugin