వేలేరుపాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘జనవాణి’ కార్యక్రమానికి ఉత్సాహభరిత హాజరు


ప్రతి ఫిర్యాదుకు తక్షణ పరిష్కారం – పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.


ఏలూరు జిల్లా, వేలేరుపాడు: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'జనవాణి' కార్యక్రమం జనసందోహంతో కిక్కిరిసింది. మండల వ్యాప్తంగా వచ్చిన సమస్యలను ప్రత్యక్ష వేదికపై స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ప్రతి ఫిర్యాదుదారుని వ్యక్తిగతంగా కలుసుకుని వినిపించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చేపట్టనున్నట్లు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని వెంటనే పరిష్కార దిశగా తీసుకెళ్లడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ప్రతి అభ్యర్థనను నమోదు చేసి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించాం” అని తెలిపారు.

జనవాణి కార్యక్రమం నిర్వహణపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ.. “సమస్యను వినిపించడానికి ఇక కార్యాలయాలు తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజలకు అందుబాటులోకి వచ్చి పరిష్కార మార్గం చూపుతున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సేవలు ప్రశంసనీయం” అంటూ హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ గణేసుల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పోట్ల మోహన్ దొర, దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి, పోడియం తులసి, సోషల్ మీడియా ఇంచార్జ్ కొవ్వల క్రాంతి కుమార్, రాయల రవికుమార్, మంచర్ల సమ్మయ్య, సోడే కళ్యాణ్, టీం లోకేష్ అధ్యక్షులు బుడిపుటీ సురేష్, సావిలి ఆనందరావు, టిడిపి సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, యాళ్ల శంకరం, కొర్రి కౌశిక్, బిజెపి ప్రధాన కార్యదర్శి సారే బాబ్జి, వివిధ శాఖల అధికారులు, P4 టీమ్, కోటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.