పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం


ఏలూరు జిల్లా, ఏలూరు: పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా విరామమెరుగక నిత్యం పరిశ్రమిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేక్రమంలో అర్హులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్లను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారితో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 


ఏలూరు 2వ డివిజన్‌లో డిసెంబర్‌ నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వారికి పెన్షన్‌ సొమ్ములను అందించారు. 

ఇదేసమయంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై లబ్దిదారుల నుండి అభిప్రాయాలను సేకరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారికి వివరించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్‌దారుల ఇళ్ళకు వెళ్ళిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతినెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులను అప్రమత్తం చేస్తూ, లబ్దిదారుల్లో భరోసా నింపుతూ వస్తున్నామన్నారు. 

ఈ నెల 27 స్పౌజ్‌ పెన్షన్లు, 5 బెడ్‌ పేషెంట్‌ పెన్షన్లను కొత్తగా మంజూరు చేసినట్లు పేర్కొన్న ఆయన, వారందరిలోనూ ధైర్యాన్ని నింపామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జవాబుదారీ పాలనకు నాంది పలికామన్న ఎమ్మెల్యే చంటి అదేలక్ష్యంతో కూటమి ప్రభుత్వ పనితీరును పెన్షన్‌దారుల అభిప్రాయాలు, స్పందనల రూపంలో తెలుసుకున్నామన్నారు. అధికారంలో లేనప్పుడూ, ఉన్నప్పుడూ అంకితభావంతో పార్టీ కోసం శ్రమించిన ప్రతిఒక్కరికీ న్యాయం చేసేందుకు కృషిచేస్తున్నానని, ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. 

కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కో-ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు, క్లస్టర్ ఇంచార్జ్ అమరావతి అశోక్, డివిజన్ ఇంచార్జ్ నాగులపల్లి గంగాధర్ రావు, కో - ఇంచార్జ్ లంకలపల్లి సతీష్, సంకాబత్తుల నాగరాజు, వాళ్ల శ్రీనివాసరావు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందుకుమార్, వెంపల అనిల్, గోవిందు, పప్పు రాంబాబు, ఇనపకుర్తి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు...