ఏలూరు జిల్లా, దెందులూరు, పెదవేగి 30: పేదల పక్షాన, న్యాయం పక్షాన, నీతి పక్షాన నిలిచి ప్రజలకు సేవ చేయడానికే నా జీవితం అంకితం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం జగన్నాధపురంలో నిర్వహించిన బేయేర్షబా ప్రార్థన సంఘం 25వ వసంతాల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సంఘ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం శాలువా కప్పి, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్నాధపురం గ్రామంలో 25 సంవత్సరాల క్రితం బెయేర్షబా ప్రార్థన సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్న సాల్మన్ రాజు, సంఘ సభ్యులందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
అలాగే కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలు పేదల అండగా నిలవడం, నీతినిబద్ధ పరిపాలన అందించడం, నిజాయితీతో ప్రజలకు సేవ చేయడం అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలందరి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.
.jpeg)

















Social Plugin