దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో వరికంకుల మాలతో రైతన్నల ఘన సత్కారం..
ఉంగుటూరు/ ఏలూరు, డిసెంబర్, 1 : ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం హెలికాప్టర్ ద్వారా ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పుష్పగుచ్చాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే లు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, డా. కామినేని శ్రీనివాస్, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపి భవన నిర్మాణ కార్మిక, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ప్రభృతులు ఉన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో వరికంకుల మాలతో రైతన్నల ఘన సత్కారం..
దెందులూరు/ఉంగుటూరు: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ, మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఎకౌంట్లో ధాన్యం సొమ్మును జమ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాల అండగా నిలుస్తున్న సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన రైతన్నల అందరి తరపున పలువురు కూటమి నాయకులు, రైతులు వరి కంకులతో చేసిన మాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు....
















Social Plugin