రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు జిల్లా, ముసునూరు: ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన కంచర్ల అంజిబాబు కుమారుడు కంచర్ల అభినయ్ సాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అభినయ్ సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి.. అంజిబాబుని పరామర్శించి, ఈ కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.