![]() |
| శంకుస్థాపన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు |
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, పోలవరం మండలం: కొయ్యలగూడెం నుండి కన్నాపురం వరకు సుమారు రూ.3 కోట్లు 70 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
అనంతరం కొయ్యలగూడెం సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి పిర్యాదులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వీకరించారు. జనవాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి పిర్యాదుపై సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సంధ్రబంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — “ప్రజలకు ఎలాంటి సమస్య అయినా అది త్వరితగతిన పరిష్కారం కావాలన్నదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణమే స్పందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని పేర్కొన్నారు.
![]() |
| ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు |
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం నాగకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, టిడిపి మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు, బిజెపి మండల అధ్యక్షుడు బొలిశెట్టి వాసు, సొసైటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, జనసేన జిల్లా నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, కోనా కుమార్, సంకు మధుబాబు,మట్టా శ్రీనివాస్, మన్నిడి సాయిబాబా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















Social Plugin