ఏలూరు నగరాన్ని రూపుమార్చనున్న వందల కోట్ల ప్రాజెక్టులు – కౌన్సిల్‌లో కీలక తీర్మానాలు

మేయర్ నూర్జహాన్ పెదబాబు

ఏలూరు, డిసెంబర్, 2: ఏ ఎజెండాలోని అన్ని అంశాలను ప్రతిపక్ష సభ్యులతో సహా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం. నగర అభివృద్ధికి ప్రజాసమస్యల పరిష్కార ఏజెండాగా మంచి పరిపాలనకు నిదర్శనమని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈరోజు మేయర్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. నగర అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి చక్కటి సాంప్రదాయ పద్ధతిలో కౌన్సిల్ సమావేశం జరగడం సంతోషదాయకమని అభివృద్ధికి సూచిక అని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.

 
18 అంశాలతో రూపొందించిన ఎజెండా మున్సిపల్ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించే అంశాలు ఉన్నాయన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 27 డివిజన్ కొంత ప్రాంతం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి ఉండడం కారణంగా సచివాలయ సేవలు వారికి వారికి ఇబ్బందికరంగా మారడంతో వారిని కార్పొరేషన్ నుంచి తొలగించి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసుకొనుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. షెడ్యూల్ కులాల నివాసితి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుటకు కోటి రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
 
నిబంధనల లోబడి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ రుసుము ప్రస్తుత రేట్లపై 33% పెంచు విషయమే కౌన్సిల్ ఆమోదం తెలిపింది అన్నారు. నగర పాలక సంస్థలో ఏడు పంచాయతీలు కలవకముందే ఏర్పడ్డ కరెంటు బిల్లు బకాయిలు అపరాధ రుసుము కలిపి 34 కోట్ల రూపాయలకు చేరిందని. బిల్లులు బకాయిలు చెల్లించడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుటకు సమావేశం తీర్మానించిందని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. 

కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు నగర పాలక సంస్థ పాలకవర్గం, కమిషనర్ ఏ.భాను ప్రతాప్ అందరం కలిసికట్టుగా చేసిన కృషి ఫలితంగా కార్పొరేషన్ కు వచ్చిన 453 కోట్ల రూపాయల నిధులతో నగరాన్ని సుందరీకరిస్తూ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎన్ ఆర్ పెదబాబు అన్నారు .

మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్,ఇతర గ్రాంట్లు 49 కోట్ల రూపాయలతో శాసనసభ్యులు వారి ఆదేశాలతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, ఫౌంటెన్లు నిర్మించడం జరిగిందన్నారు. అమృత్ 2.1 నిధులు 291 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థలో కలిసిన ఏడు పంచాయతీలను కలుపుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రీట్మెంట్ ప్లాంట్, త్రాగునీటి కోసం 66 కిలోమీటర్ల పైపులైను, 5 రిజర్వాయర్లు,1 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, 20 ఎంఎల్ డి ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామనీ ఎస్. ఎం. ఆర్. పెదబాబు తెలిపారు.

కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
5 కోట్ల 50 లక్షలు రూపాయలతో దెందులూరు వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజీ పూర్తిస్థాయిలో శాశ్వత పరిష్కార పనులు ప్రారంభించామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 4 వందల కిలోమీటర్ల మేర 100 కోట్ల రూపాయల అంచనాలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టం పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. 3 కోట్ల రూపాయలతో హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపడుతున్నామనీ, ఎన్ క్యాప్ నిధులు 6 కోట్ల 57 లక్షల రూపాయలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు సూచనలకు అనుగుణంగా పొల్యూషన్ అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పెదబాబు అన్నారు.

వీటిలో కొన్ని పనులు ప్రారంభించగా కొన్ని పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. వందల కోట్ల రూపాయల నిధులు ఉపయోగించి ఏలూరు నగరం దిశ దశ మార్చబోతున్నామని, ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధంతో నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తున్నారు అన్నారు. 

నిరంతరం ప్రజా సేవకై అంకితం అవుతూ.. అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీరుస్తున్నారన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కో-ఆప్షన్ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్, అదనపు కమిషనర్ డి. శ్రీనివాస్ మున్సిపల్ ఇంజనీర్ ఈ. సురేంద్రబాబు, మేనేజర్ మూర్తి, పలువురు డి.ఇ లు ఏఈలు,అన్ని సెక్షన్ అధికారులు పాల్గొన్నారు...