ఏలూరు (టూటౌన్): ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తుదారులకు ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధనా, ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు బోధించడం జరుగుతుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైనవారికి సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు.
5వ తరగతి ఆపైన చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95733 37484, 72869 93033, 94923 37469 నంబర్లలో సంప్రదించాలన్నారు.















Social Plugin