జీలుగుమిల్లి, డిసెంబర్ 24: జీలుగుమిల్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గ్రౌండ్‌లో మంగళవారం రాత్రి హోప్ మినిస్ట్రీస్ – గ్రేస్ మందిర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీస్తు జనన నాటికను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, క్షమ, సోదరభావాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
క్రీస్తు జనన నాటికను కళాకారులు ఎంతో ఆహ్లాదకరంగా ప్రదర్శించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. ఈ కార్యక్రమం జీలుగుమిల్లి ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి, గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు ఎజ్రా శాస్త్రి, హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు గడ్డం శామ్యూల్ జాషువాతో పాటు పలువురు నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.















Social Plugin