విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధం


ఏలూరు జిల్లా, చాట్రాయి: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైన ఘటన జనార్థనవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నడిపింటి రాంబాబు తాటాకింటిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. 

వంట సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్లతోపాటు బంగారం, నగదు, ధాన్యం దగ్ధమవ్వడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.