- CSR నిధులతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రికార్డు.
- ఇటీవలే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కోటి విలువైన వైద్య పరికరాలు.
- తాజాగా 2.5 కోట్ల ONGC నిధులతో జిల్లాలో 11 ప్రభుత్వ కాలేజీలు/స్కూళ్ల విద్యార్ధులకు AI కంప్యూటర్ నైపుణ్యాలు.
- విద్యా, వైద్యం, పరిశ్రమలు, అభివృద్ధి అన్నింటిపై దృష్టి పెడుతూ ప్రశంసలు పొందుతున్న ఎంపీ.
ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 09: ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు కూడా నడుం బిగించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎంపిక చేసిన ఉన్న 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయించే కార్యక్రమం ప్రారంభించారు.
ఈ 11 కాలేజీలు/పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును భరించవలసిందిగా ఓఎన్జీసీ సంస్థతో మాట్లాడి ఒప్పించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఎంపీ విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు కోసం రూ. 2.5 కోట్లు ఇచ్చేందుకు ఓఎన్జీసీ సంస్థ అంగీకరించింది. దీనితో ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ (ORRC) అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో 11 కాలేజీలు/పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, కైకలూరు, చింతలపూడి, బుట్టాయిగూడెం, నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఏలూరు, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, రాజవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వచ్చే జనవరి నాటికి ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు కానున్నాయి.
ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా, ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి దశలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ల వల్ల కళాశాల/పాఠశాలల్లో చదువుతున్న సుమారు 3000 మంది విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ సంబంధిత నైపుణ్యం నేర్చుకుని, తద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతే కాకుండా అదే కళాశాల/ పాఠశాలలో చదివి, ఏఐ పట్ల ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఏఐ నైపుణ్యాన్ని నేర్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఇదే సందర్భంలో, తన విజ్ఞప్తి మేరకు సీఎస్ఆర్ కింద రెండున్నర కోట్ల విలువైన ఏఐ కంప్యూటర్ ల్యాబు పరికరాలు అందించిన ఓఎన్జీసీ సంస్థకు, తన ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంతో ఉపకరించే ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా పనిచేస్తున్న ORRC స్వచ్ఛంద సంస్థకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్దులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలిపారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బందులను గమనించి ఇటీవలే గెయిల్ ఇండియా ద్వారా కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నేడు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఏఐ టెక్నాలజీని తన ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్దులకు అందించాలనే లక్ష్యంతో 2.5 కోట్ల విలువైన ఏఐ కంప్యూటర్ పరికరాలను అందజేయటం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా అభివృద్ధి కోసం కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా, వివిధ కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలను సంప్రదిస్తూ వారి నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద జిల్లాకు నిధులు తీసుకువస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై రాజకీయ, అధికార వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.















Social Plugin