జీలుగుమిల్లి, డిసెంబర్ 12: జీలుగుమిల్లి రైస్ మిల్ గ్రౌండ్‌లో గ్రేస్ మందిర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. భక్తిపూర్వక వాతావరణంలో క్రిస్మస్ సందడి నడుమ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడారు.
క్రిస్మస్ పర్వదినం ప్రేమ, శాంతి, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, ప్రతి మతానికి సమాన గౌరవం, ప్రతి పౌరుడి భద్రత మరియు అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, గ్రామాభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, కరోల్స్, ప్రత్యేక ప్రార్థనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే గారు క్రిస్మస్ ట్రీను వెలిగించి, పాల్గొన్న చిన్నారులను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు ఎజ్రా శాస్త్రి, పేరాబత్తుల ధనంజయతో పాటు గ్రేస్ మందిర్ సభ్యులు పాల్గొన్నారు.















Social Plugin