ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి: డిసెంబర్ 1 నుండి 20 వరకు 165 జాతీయ రహదారిపై రైల్వే గేటు మూసివేత. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో భాగంగా ఏడో నంబర్ పిల్లర్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు సూచిస్తున్నారు. బరువు పరీక్షలు విజయవంతం కావడంతో పైల్ క్యాప్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరిన్ని పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కొనసాగనుంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో డిసెంబర్ 1 నుండి 20వ తేదీ వరకు 165 జాతీయ రహదారిపై రైల్వే గేటును మూసివేయనున్నారు. ఉండిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనుల్లో భాగంగా ఏడో నంబర్ పిల్లర్ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు సూచిస్తున్నారు.' నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి నుంచి ఆకివీడు మీదుగా కైకలూరు, గుడివాడ, విజయవాడ వెళ్లే వాహనాలు ఉండి, పాములపర్రు, పెదకాపవరం, గుమ్ములూరు, ఆకివీడు మీదుగా వెళ్లాలి' అని సూచించారు.
అలాగే 'గుడివాడ, ఏలూరు, కైకలూరు, ఆకివీడు నుంచి భీమవరం వెళ్లే వాహనాలు ఆకివీడులో అయిభీమవరం రహదారిపై జువ్వలపాలెం, కాళ్ల, పెదఅమిరంల మీదుగా భీమవరం చేరుకోవాలి' అని అధికారులు తెలిపారు. 'ఆకివీడు నుంచి చెరుకువాడ, కలిసిపూడి, ఉండి పెదపుల్లేరు వంతెన మీదుగా పెదపుల్లేరు, చినపుల్లేరు, సీసలి, జక్కరంల మీదుగా భీమవరం వెళ్లాలి' అని సూచిస్తూ, మళ్లింపు మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తాత్కాలిక మూసివేత వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఏడో నంబర్ పిల్లర్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి నిర్వహించిన బరువు పరీక్షలు విజయవంతమయ్యాయి. రైల్వే, ఐపీఆర్‌సీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20న జరిగిన ఈ పరీక్షల్లో వంతెన డిజైన్ ప్రకారం 340 టన్నుల బరువున్న వాహనాలు వెళ్తాయని మొదట అంచనా వేశారు. అయితే, 510 టన్నుల వరకు బరువున్న వాహనాలు వెళ్లినా పునాదులు తట్టుకుంటాయా లేదా అనే దానిపై ఈ పరీక్షలు జరిగాయి. పరీక్షలు సత్ఫలితాలనిచ్చాయని అధికారులు తెలిపారు.
ఈ పరీక్షల ఫలితాల పూర్తి కావడంతో ఏడో నంబర్ పిల్లర్ పునాదులపై పైల్ క్యాప్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉండి వైపు రైల్వే ట్రాక్‌కు దగ్గరగా జాతీయ రహదారిని సగం వరకు తవ్వనున్నారు. ఈ నిర్మాణ పనులకు అవసరమైన ఇనుము, ఇతర సామగ్రిని ఇప్పటికే ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, 9, 10 పిల్లర్లపై శ్లాబ్ నిర్మాణ పనులు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ పనుల వల్ల రహదారిపై ట్రాఫిక్‌ను ఎక్కువ రోజులు మళ్లించాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.















Social Plugin