ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన — పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి


ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు: డిసెంబర్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం, 10.55 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులను కలుసుకోనున్నారు.

తరువాత 11.10 గంటలకు గొల్లగూడెం నుండి బయలుదేరి, ఉంగుటూరు మండలం గోపీనాథపట్నానికి చేరుకుని లబ్దిదారుల ఇళ్లను సందర్శిస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

11.40 గంటలకు సీఎం గోపీనాథపట్నం నుంచి బయలుదేరి నల్లమాడ చెరుకు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి, 2.05 గంటలకు మళ్లీ గొల్లగూడెం చేరుకుని క్యాడర్ మీటింగ్‌లో పాల్గొంటారు.

ఆ తరువాత 3.35 గంటలకు అక్కడి నుండి బయలుదేరి, 3.40 గంటలకు హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 3.45 గంటలకు గొల్లగూడెం నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరిగి ప్రయాణం అవుతారు.